Homeహైదరాబాద్latest Newsముస్తాబాద్ మండలంలో తీవ్ర విషాదం.. అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య..!

ముస్తాబాద్ మండలంలో తీవ్ర విషాదం.. అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య..!

ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన వేముల మల్లేష్ (40) అనే వ్యక్తి అప్పుల బాధతో మనస్థాపం చెంది ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకున్నాడు. వేముల మల్లేష్ గత మూడుసార్లుగా గల్ఫ్ దేశాలకు వెళ్లి అప్పుల పాలై కౌలుకు వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఆయనకు ముగ్గురు పిల్లలు శివ బాలాజీ (14) స్వాత్విక్ (12) కూతురు మనస్విని (9). భార్య రజిత స్వగ్రామం గాజుల మాచాపూర్ కు తన సోదరులకు రాఖీ కట్టేందుకు వెళ్ళింది. ఉదయం తన కుమారులను పాఠశాలల్లో వదిలేసి ఇంటికి వచ్చి ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకొని మృతి చెందాడు. సంఘటన స్థలానికి ఎస్సై గణేష్ చేరుకొని మృతికి గల కారణాలు కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టంకు తరలిస్తున్నట్లు బంధువులు తెలిపారు.

Recent

- Advertisment -spot_img