ఇదే నిజం, మంచిర్యాల జిల్లా : రామగుండం కమిషనరేట్‌లో ప్రత్యేక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌ను పోలీస్ కమీషనర్ శ్రీనివాస్ ప్రారంభించారు. రూ.లక్షకు మించి ఎక్కువగా సైబర్ నేరాలకు గురైతే ఇక్కడ ఫిర్యాదు చేయాలని, అంతకన్నా తక్కువ ఉంటే పోలీస్ స్టేషన్‌లోనే ఫిర్యాదు చేయాలని సీపీ తెలిపారు. సైబర్ మోసానికి గురైన బాధితులు వెంటనే 1930కి కాల్ , లేదా www.cybercrime. gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయొచ్చని వివరించారు. పర్యవేక్షక అధికారిగా ఏసీపీ వెంకటరమణ , ఇన్‌స్పెక్టర్ కృష్ణ మూర్తి, 01 హెచ్‌సీలు, 07 మంది కానిస్టేబుళ్లు ఉంటారన్నారు.