తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. వనపర్తి – మదనాపురం బాలుర గురుకులంలో 7వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కొన్నురు గ్రామానికి చెందిన 7వ తరగతి విద్యార్థి ప్రవీణ్ మదనాపురం బాలుర గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుకుంటున్నాడు. అయితే ఈరోజు విద్యార్థి ప్రవీణ్ దుప్పటితో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ఎందుకు పాల్పడ్డాడు అన్న విషయం ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.