నైరుతి రుతుపవనాల వల్ల వారం రోజులుగా తెలంగాణ రాష్ట్రాన్ని మేఘాలు కమ్మేశాయి. బంగాళాఖాతంలో గంటకు 31 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఆ ప్రభావం తెలంగాణలో ఉంది. ఇక్కడ గంటకు 10 కిలోమీటర్ల వేగంతో చలిగాలులు వీస్తున్నాయి. రానున్న రోజుల్లో చలి తీవ్రత అధికంగా పెరగబోతోందని హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. కొన్నిరోజులుగా రాష్ట్రంలో పొగమంచు ఎక్కువగా ఉంది. ఇప్పుడు చలితీవ్రత కూడా పెరిగితే మంచు అధికమయ్యే అవకాశం ఉంది.