Homeహైదరాబాద్latest Newsరోడ్డుపైనే మురుగు నీరు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు.. సరిచేయాలని డిమాండ్ చేస్తూ వార్డు ప్రజలు ఆందోళనలు

రోడ్డుపైనే మురుగు నీరు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు.. సరిచేయాలని డిమాండ్ చేస్తూ వార్డు ప్రజలు ఆందోళనలు

  • దళిత వాడలపై నిర్లక్ష్యం
  • ఎండాకాలమే హెచ్చరించిన ‘ఇదేనిజం’
  • సందర్శించిన కమిషనర్

ఇదేనిజం, లక్షెట్టిపేట: పట్టణంలోని 9వ వార్డు పరిధి లోని అంగన్వాడీ కి వెళ్ళే దారిని వెంటనే సరి చేయాలని ఆ వార్డు ప్రజలు డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రోడ్డును సందర్శించారు. వార్డు ప్రజలు తమ సమస్యను ఆయనకు తెలియజేశారు. రోడ్డు మీదకి మురుగు నీరు రావడంతో నడవడానికి వీలు లేకుండా, రోడ్డు మీద నిర్మించిన డ్రైనేజీ అంచున సర్కస్ ఫీట్లు చేస్తూ నడిచి వెళ్లాల్సి వస్తుందని మహిళలు, వృద్ధులు పడిపోయి దెబ్బలు తగిలించు కుంటున్నారని మండిపడ్డారు. డ్రైనేజీ లోపలే నాలుగు కరెంటు స్తంభాలున్నాయని, వాటిని పట్టుకుని నడిచే సమయంలో ఏదైనా కరెంట్ ప్రమాదం ఏర్పడితే ఎవరు బాధ్యులు అని ప్రశ్నించారు. అక్కడే ఉన్న అంగన్వాడీ లో సుమారు 30 మంది చిన్నపిల్లలు, 20 కుటుంబాలున్నాయన్నారు. రోడ్డుపై మురుగు నీరు నిలవడం వలన దోమలు ప్రభావితమై అనేక సీజనల్ వ్యాధుల వ్యాపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాధుల బారిన పడి ఆసుపత్రుల లో ఖర్చుల పాలవుతున్నామన్నారు. గత రెండు సంవత్సారాలుగా ప్రజలు పోరాటం చేస్తున్న ఎవరు పట్టించుకోవడం లేదన్నారు.

ఎండాకాలంలోనే “ఇదేనిజం” డిజిటల్ పత్రిక ఎండకాలమే ఇలా, వర్షాకాలం ఇంకెలా?? అని వార్త ప్రచురిస్తూ హెచ్చరించింది. విపరీతంగా పన్ను వసూలు చేస్తున్న మున్సిపాలిటీ ప్రజలకి రోడ్డు, డ్రైనేజీల నిర్మాణం, తాగు నీరు అందించడమేనని, ఈ మూడు తమకు లేనందున, సమస్య పూర్తి స్థాయిలో పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు అయిల్ల విజయ్ ,అడ్లురి సతీష్, ఇమ్మయ్య, కాంతయ్య, మడిపల్లి స్వామి, ఐల్ల రాజలింగు, అడపా శ్రీను, ఏనుగుల శ్రీను, దర్షణాల వంశీ, శనిగారపు సంతోష్, సన్ని, సామ్యూల్, డిన్ను, రవీందర్, కమటం బాబీ, కొప్పుల లచ్చన్న, ఏనుగుల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

డెంగీ జ్వరాలతో బాధపడుతున్నాం- ఏనుగుల శ్రీనివాస్, 9వ వార్డు స్థానికుడు
నాకు ఇద్దరు పిల్లలు, మురుగు నీరు వల్ల విపరీతంగా దోమలు పెరిగాయి. 20 రోజుల్లోపే చిన్నమ్మాయికి రెండు సార్లు డెంగీ వ్యాధి వచ్చింది. చాలా డబ్బులు ఖర్చు అయ్యాయి. సమస్యను పరిష్కరించకపోతే ఆందోళన చేస్తాం.

సమస్యను శాశ్వత పరిష్కరించాలి- అయిల్ల విజయ్, కాంగ్రెస్ నాయకుడు
9వ వార్డులోని ఎస్సీ కాలనిలో రోడ్డుపై నీరు వెళ్లేలా మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టాలి. తాత్కాలిక చర్యలు కాకుండా శాశ్వతంగా పరిష్కరించాలి. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం.

సాధ్యమైనంత తొందర్లోనే పరిష్కరిస్తాం- కల్లెడ రాజశేఖర్, మున్సిపల్ కమిషనర్
9వ వార్డులో ఏర్పడిన సమస్యను సాధ్యమైనంత తొందర్లోనే మున్సిపల్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాం. బ్లీచింగ్ పౌడర్ చల్లిస్తాం. సీజనల్ వ్యాధులు సోక కుండా తగు చర్యలు చెప్పడతాం.

Recent

- Advertisment -spot_img