కర్ణాటక సెక్స్ స్కామ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ నేడు లొంగిపోయే అవకాశం ఉంది. అశ్లీల వీడియోల పెన్ డ్రైవ్ కేసు బయటకు రావడంతో హాసన్ జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఏప్రిల్ 28వ తేదీ రాత్రి జర్మనీకి పారిపోయారు. అయితే నేడు తిరిగి ఆయన బెంగళూరు విమనాశ్రయానికి చేరుకునే అవకాశం ఉండడంతో పోలీసులు గత రాత్రి నుంచే విమానాశ్రయంలో పెద్ద ఎత్తున మోహరించారు. ఇప్పటికే ప్రజ్వల్ తండ్రి హెచ్డీ రేవణ్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజ్వల్‌పై బ్లూకార్నర్ నోటీస్ జారీ అయింది. ఈ నేపథ్యంలో పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు ఆయన జర్మనీ నుంచి బయలుదేరినట్టు వార్తలు వచ్చాయి. ప్రజ్వల్ దుబాయ్ నుంచి వస్తున్నట్టు అనధికారిక వార్తలను బట్టి తెలుస్తోంది. తండ్రి, ఆయన న్యాయవాది సలహా మేరకే ప్రజ్వల్ లొంగిపోతున్నట్టు సమాచారం.