అన్నా యూనివర్సిటీలో విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఘటనపై ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదని నిరసనగా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కొరడాతో కొట్టుకున్నాడు. తమిళనాడులో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, రాష్ట్రంలో చెడు అంతమై పోవాలని కోరుతూ తన నివాసంలో ఆరు కొరడా దెబ్బలు కొట్టుకొని మునుగన్కు మొక్కు చెల్లించుకున్నానని అన్నామలై తెలిపారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో డీఎంకే పార్టీని గద్దె దించే వరకు తాను చెప్పులు వేసుకోనంటూ అన్నామలై నిన్న శపథం చేసారు.