Homeహైదరాబాద్latest Newsశభాష్.. ఆర్టీసీ బస్సులోనే గర్భిణికి పురుడు పోసిన మహిళా కండక్టర్‌..!

శభాష్.. ఆర్టీసీ బస్సులోనే గర్భిణికి పురుడు పోసిన మహిళా కండక్టర్‌..!

ఓ మహిళా కండక్టర్‌ ఆర్టీసీ బస్సులో గర్భిణికి డెలివరీ చేసి మానవత్వం చాటుకున్నారు. గద్వాల-వనపర్తి రూట్‌ పల్లె వెలుగు బస్సులో సోమవారం ఉదయం సంధ్య అనే గర్భిణి రక్షాబంధనన్‌ సందర్భంగా తన సోదరులకు రాఖీ కట్టేందుకు వనపర్తికి వెళ్తున్నారు. బస్సు నాచహల్లి సమీపంలోకి రాగానే గర్బిణికి ఒక్కసారిగా పురిటినొప్పులు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన మహిళా కండక్టర్‌ జి.భారతి బస్సును ఆపించారు. అదే బస్సులో ప్రయాణిస్తోన్న ఒక నర్సు సాయంతో గర్భిణికి పురుడు పోశారు. పండంటి ఆడ‌బిడ్డ‌కు మ‌హిళ జ‌న్మ‌నిచ్చారు. అనంతరం 108 సాయంతో తల్లీబిడ్డను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్ర‌స్తుతం త‌ల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు.

Recent

- Advertisment -spot_img