Homeహైదరాబాద్latest Newsషాహిన్ అఫ్రిదిపై వేటు.. మరి బాబర్‌ అజామ్‌ సంగతేంటి?’

షాహిన్ అఫ్రిదిపై వేటు.. మరి బాబర్‌ అజామ్‌ సంగతేంటి?’

స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో అనూహ్య ఓటమిని చవిచూసిన పాకిస్థాన్ మరో ఆసక్తికర మ్యాచ్‌కు సిద్ధమైంది. శుక్రవారం నుంచి రావల్పిండి వేదికగా ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఇదే వేదికపై జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ చారిత్రాత్మక విజయంతో బంగ్లాదేశ్‌పై 1-0 ఆధిక్యాన్ని కొనసాగించింది. ఈ సిరీస్‌ను కాపాడుకోవాలంటే పాకిస్థాన్‌కు చివరి మ్యాచ్‌లో గెలవడం చాలా కీలకం. తొలి టెస్టు ఓటమి నేపథ్యంలో సర్వత్రా విమర్శలు ఎదుర్కొన్న పాక్ జట్టు.. విజయమే లక్ష్యంగా రెండో టెస్టుకు సిద్ధమైంది. రెండో టెస్టుకు 12 మంది సభ్యులతో కూడిన పాకిస్థాన్ జట్టును ఒకరోజు ముందుగానే పీసీబీ ప్రకటించింది. ఊహించినట్లుగానే రెండో టెస్టుకు షాహీన్ అఫ్రిది దూరమయ్యాడు. పాకిస్థాన్ కోచ్ జాసన్ గిల్లెస్పీ ఇటీవలే తండ్రి అయ్యాడని, తన కుటుంబంతో గడపడానికి విశ్రాంతి తీసుకున్నట్లు వివరించాడు. అయితే బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో పాకిస్థాన్‌ ఓడిపోవడంపై వెటరన్ క్రికెటర్ అహ్మద్ షెహజద్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాడు. ‘‘మీరు జింబాబ్వే, ఐర్లాండ్‌, యూఎస్‌ఏ, భారత్‌, ఆఖరికి బంగ్లాదేశ్‌ చేతిలోనూ ఓడిపోయారు. దీనింతటికి షహీన్‌ ఒక్కడే కారణమని మీరు భావిస్తున్నారా? టెస్టుల్లో గత 14 ఇన్నింగ్స్‌ల్లో బాబర్‌ అజామ్‌ ఎలా ఆడాడు? షహీన్‌ను మాత్రమే బాధ్యుడిని చేస్తూ పక్కన పెట్టడం ఎంతవరకు సమంజసం’’ అని పేర్కొన్నారు.

spot_img

Recent

- Advertisment -spot_img