అజయ్ దేవగణ్, మాధవన్, జ్యోతిక, జంకి బొడివాల ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ వికాస్ భల్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ నేచురల్ హర్రర్ మూవీ ‘సైతాన్’. ఈ నెల 8న శివరాత్రి రోజున రిలీజైన ఈ మూవీ ఇప్పటివరకు రూ.69.51 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇది సెన్షేషన్ రెస్పాన్స్ అని చెప్పాలి. వీక్ డేస్లో కూడా ఈ రేంజ్ హోల్డ్ కనబరచడం గొప్ప విషయం. జియో స్టూడియోస్, దేవగణ్, ఫిల్మ్స్, పనోరమా స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మించిన ఈ మూవీకి అమిత్ త్రివేది సంగీతం అందించారు. ఈ వారాంతం కి సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.