ప్రముఖ సంగీత స్వరకర్త ఇళయరాజా ఇటీవల తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయాన్ని సందర్శించినప్పుడు ఆలయ గర్భగుడి ముందు ఉన్న పవిత్ర ప్రాంతమైన అర్థ మండపంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడం వివాదానికి దారితీసింది. వివరాల్లోకి వెళ్ళితే.. తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయ గర్భగుడి ఎదురుగా ఉన్న అర్ధ మండపంలోకి ఇళయరాజా ప్రవేశించారు. అయితే అక్కడి సిబ్బంది ఇళయరాజాని అక్కడి నుంచి పంపించేశారు. అర్ధ మండపం మెట్ల దగ్గర నిలబడి ఆలయ మర్యాదలను ఆయన స్వీకరించారు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆలయంలోని అర్ధమండపంలోకి ఇళయరాజాను అనుమతించకపోవడంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆలయ అర్ధమండపంలోకి జీయర్లను మాత్రమే మాత్రమే ప్రవేశం ఉందిని ఆలయ సిబ్బంది తెలిపారు. ఆలయ నిబంధనలకు విరుద్ధంగా అర్ధ మండపంలోకి ఎవరూ రాకూడదన్నారు. ఇళయరాజా అనుకోకుండా అర్ధమండపంలోకి ప్రవేశించారని వివరించారు.