HomeతెలంగాణSharmila:షర్మిల పయనమెటు? ఆదరణ కష్టమే

Sharmila:షర్మిల పయనమెటు? ఆదరణ కష్టమే

Sharmila:రాజన్న బిడ్డగా చెబుతున్నా .. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని పదే పదే ప్రసంగంలో చెబుతున్న షర్మిల కు ఆమె పయనమెటు అనే అంశం ఆమెకైనా స్పష్టత ఉందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న . అసలు ఆమె తెలంగాణాలో పర్యటించడానికి కారణం రాజకీయ విశ్లేషకులకు కూడా అంచనాకు అందడం లేదు . ప్రజాస్వామ్యంలో పార్టీ ఎవరైనా పెట్టవచ్చు ,ప్రచారం చేసుకోవచ్చు . ఆ హక్కును ఎవ్వరం కాదనలేం. కనీసం ఒక్క సీటు కూడా గెలువలేని పరిస్థితుల్లో ఉన్న షర్మిల ఏం ఆశించి
పాదయాత్ర చేస్తుందో ఇప్పటికీ ఎవ్వరికీ అర్ధ మ్ కావడం లేదు . ప్రతిపక్షాలు విమర్శించినట్లు ఎవ్వరు విడిచిన బాణమో కూడా స్పష్టత లేదు.ఖమ్మంలో కొంత షర్మిల యాస కు భాష కు కొంత ఆదరణ దొరికే అవకాశాలు ఉన్నప్పటికీ ..ఈ సారి జరుగబోయే ఎన్నికలు అంత ఈజీ గా ఉండవు. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ మినహా ఇతర ఏ పార్టీ ఢీకొనే దాఖలాలు లేవు .ఖమ్మం లోని పాలేరు నియోజక వర్గం నుంచి బరిలోకి దిగి తెలంగాణ అసెంబ్లీలో అడుగు పెట్టాలని షర్మిల ఆశిస్తున్నప్పటికే క్యాడర్ లేక పోవడం, బీఆర్ఎస్ ,కాంగ్రెస్ బలంగా ఉండటం కూడా షర్మిలకు ప్రతికూల అంశాలు .స్వర్గీయ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురుగా, వై ఎస్ జగన్ చెల్లిగా కాకుండా వేరే ప్రత్యేకతలు చెప్పుకో దగ్గవి ఏమీ లేవు

సొంతంగా పార్టీ పెట్టిన‌ప్ప‌టి నుంచి ఖ‌మ్మం జిల్లాపై ష‌ర్మిల దృష్టి ఉంది. ప్ర‌త్యేకించి పాలేరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆమె పోటీ చేయ‌నుంద‌నే వార్త‌లూ వ‌స్తూనే ఉన్నాయి. పోటీ చేయ‌డానికి అయితే ఆమెకు అది అనుకూల నియోజ‌క‌వ‌ర్గ‌మే కానీ, గెల‌వ‌గ‌ల‌దా? అనేది మాత్రం స‌హ‌జంగా ప్ర‌శ్నగానే మిగిలింది.నిజాలు చెప్పుకుంటే తెలంగాణ‌లో ష‌ర్మిల రాజ‌కీయ ప‌య‌నం అంతగొప్ప‌గా ఏమీ లేదు. ఈ సుదూర పాద‌యాత్రికురాలు తెలంగాణ‌లో చిన్న‌పాటి స‌మూహాన్ని వేసుకుని న‌డుస్తూ ఎందుకు న‌డుస్తోందో అనేంత సందేహాల‌ను జ‌నింప‌జేస్తోంది. మ‌రి రాష్ట్ర వ్యాప్త పోటీకి ష‌ర్మిల పార్టీ కి ప‌ట్టు లేద‌ని స్ప‌ష్టం అవుతోంది. ఏవో ఒక‌టీ రెండు ఉప ఎన్నిక‌లు వ‌చ్చినా, వాటిల్లో క‌నీసం అభ్య‌ర్థిని పెట్ట‌లేక‌పోయారు ష‌ర్మిల‌. ఒక‌వేళ పోటీ చేసి ఉంటే, అతి త‌క్కువ ఓట్లు వ‌చ్చి ప‌రువుపోయేదేఏమో? ఇలా ఉప ఎన్నిక‌ల్లో పోటీకి దూరంగా ఉంటూ ష‌ర్మిల రాజ‌కీయంగా మ‌రింత ప‌లుచ‌న అయ్యారు.

పాలేరు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిణామాలు మాత్రం ష‌ర్మిల‌కు అనుకూలంగా ఉన్న‌ట్టున్నాయి. మొద‌టి నుంచి పాలేరు కాంగ్రెస్ కు కంచుకోట లాంటిదే! 2016 లో జ‌రిగిన ఒక ఉప ఎన్నిక‌లో టీఆర్ఎస్ నెగ్గింది. ఇక గ‌త ఎన్నిక‌ల్లో కూడా ఈ నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ కు జై కొట్టారు స్థానికులు. టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు వంటి సీనియ‌ర్ నిల‌బ‌డినా, కాంగ్రెస్ అభ్య‌ర్తి కందాల ఉపేంద్ర రెడ్డి విజ‌యం సాధించారు. ఇలా ఈ నియోజ‌క‌వ‌ర్గంపై కాంగ్రెస్ ప‌ట్టు నిల‌బ‌డింది.ఎమ్మెల్యేగా గెలిచాకా ఉపేంద్ర రెడ్డి టీఆర్ఎస్ పంచ‌న చేరారు. ఇది స్థానిక కాంగ్రెస్ క్యాడ‌ర్ కు బాగా నిరుత్సాహాన్ని క‌లిగించింది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ స‌హ‌జ‌మైన ఓటు బ్యాంకు ఉంది.

Recent

- Advertisment -spot_img