SHARMILA : కాంగ్రెస్ ,బీజేపీ లు కూడా ప్రజలను మోసం చేసే పార్టీలేనని విమర్శించారు.బీజేపీ మత పిచ్చి పార్టీ మతాన్ని అడ్డుపెట్టుకొని బీజేపీ రాజకీయం చేస్తుందని విమర్శించారు.13 ఏళ్ల క్రితం చనిపోయిన వైఎస్సార్ ను ఇప్పటికీ ప్రజలు గుర్తు పెట్టుకున్నారు.గుండెల్లో పెట్టుకున్నారని, ఆయన పెట్టిన ప్రతి పథకం ప్రజలకు గుర్తుందన్నారు.కేసీఅర్ 8 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలను మోసమే చేశారు.ఈ పాలమూరు జిల్లా అంటే కేసీఅర్ కి చిన్న చూపు ఉందని. ఆరోపించారు. అసలు దక్షిణ తెలంగాణ అంటే నే కేసీఅర్ కు ప్రేమ లేదని,ఇచ్చిన ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదన్నారు. వనపర్తి జిల్లాలో యాత్ర సందర్బంగా తెలంగాణ వై ఎస్సార్ పార్టీ నాయకురాలు అన్ని పార్టీలను విమర్శించారు.ఆత్మగౌరవం అని చెప్పి మోసంచేసాడని, మూడు ఎకరాల భూమి అని మోసం..ఇలా ప్రతిదీ మోసమే అని అన్నారు ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రుణమాఫీ అని చెప్పి మోసం చేశారని విమర్శించారు.ఎన్నికలు వస్తున్నాయి ..కేసీఅర్ మళ్ళీ వస్తాడు.గాడిదకు రంగు పూసి ఇదే ఆవు అని నమ్మిస్తడని అన్నారు.ఈ సారి కేసీఅర్ కి ఓటు వేస్తే మన భవిష్యత్ మనలను క్షమించదని అన్నారు.ఆలోచన చేసి మీకోసం నిలబడే వారికి ఓటు వేయండి.ఓటు మీ జీవితాలను మార్చే ఆయుధం అన్నారు.(SHARMILA)