Homeహైదరాబాద్latest Newsకాంగ్రెస్‌ కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిల నామినేషన్

కాంగ్రెస్‌ కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిల నామినేషన్

– ఆర్వో ఆఫీసులో అందజేసిన పీసీసీ చీఫ్​

ఇదే నిజం, ఏపీ బ్యూరో: ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల శనివారం కడప లోక్‌సభ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. కలెక్టరేట్‌లో ఆర్వోకు నామినేషన్‌ పత్రాలను అందజేశారు. ఆమె వెంట వివేకా కుమార్తె సునీత ఉన్నారు. అంతకుముందు ఇడుపులపాయలో వైఎస్‌ ఘాట్‌ వద్ద షర్మిల నివాళి అర్పించారు. నామినేషన్‌ పత్రాలను అక్కడ ఉంచి ఆశీస్సులు తీసుకున్నట్లు ఆమె తెలిపారు. కడప నియోజకవర్గ ప్రజలు ఎన్నికల్లో మంచి తీర్పు ఇస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు.

Recent

- Advertisment -spot_img