ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ గెస్ట్ హౌస్లోకి వరద నీరు చేరింది. కృష్ణా జిల్లా కేసరపల్లిలోని విల్లాలను వరద చుట్టుముట్టింది. దీంతో అధికారులు అక్కడ నివాసం ఉన్నవారిని ఖాళీ చేయిస్తున్నారు. విల్లాలలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ల కుటుంబాలు కూడా ఉన్నట్టు సమాచారం.