Homeహైదరాబాద్latest Newsమంచినీళ్ల కోసం వచ్చి గొలుసు కొట్టేసింది

మంచినీళ్ల కోసం వచ్చి గొలుసు కొట్టేసింది


– పోలీసుల అదుపులో నిందితురాలు

ఇదేనిజం, మల్కాజ్​గిరి: ఓ మహిళ మంచినీళ్ల కోసం వచ్చి గొలుసు కొట్టేసిన ఘటన మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా మీర్జాలగూడులో చోటు చేసుకున్నది. మీర్జాలగూడకు రాధిక అనే మహిళ వద్దకు గుర్తుతెలియని ఓ మహిళ వచ్చి మంచినీరు కావాలని అడిగింది. ఆమె నీళ్లు తీసుకొచ్చేందుకు ఇంట్లోకి వెళ్లింది. అదే అదనుగా సదరు మహిళ రాధిక కండ్లల్లో కారంపొడి చల్లి 3 తులాల బంగారు గొలుసు కొట్టేసింది. ఈ ఘటన ఈ నెల 6న జరగగా రాధిక ఫిర్యాదు మేరకు పోలీసులు ఎంక్వైరీ మొదలుపెట్టారు. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు విచారణ జరిపి సదరు మహిళను గుర్తించారు. నిందితురాలిని కృష్ణాజిల్లాకు చెందిన పుల్లమ్మగా గుర్తించి రిమాండ్​ కు తరలించారు.

Recent

- Advertisment -spot_img