HomeసినిమాShekar​–Dhanush​ మూవీ.. జనవరిలో షూటింగ్ స్టార్ట్!

Shekar​–Dhanush​ మూవీ.. జనవరిలో షూటింగ్ స్టార్ట్!

ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్, ఫిదా, లవ్ స్టోరీ లాంటి ఫీల్​గుడ్​ మూవీస్​తో భారీ హిట్లు కొట్టిన డైరెక్టర్ శేఖర్ కమ్ముల. లీడర్​ సినిమాతో రానాను లాంచ్​ చేసి మంచి మెసేజ్ ఓరియెంటెడ్​ సినిమాను సైతం శేఖర్​ టాలీవుడ్​కు అందించారు. అయితే, కాస్త ఎక్కువ గ్యాప్​ తీసుకునే శేఖర్ కమ్ముల గుర్తుండిపోయే సినిమాలను అందిస్తారు. శేఖర్ కమ్ముల చివరి సినిమా 2021లో నాగచైతన్య, సాయిపల్లవి నటించిన లవ్​ స్టోరీ. ఆ సినిమా రిలీజై రెండేళ్లు దాటినా ఆయన మరో సినిమాను మొదలుపెట్టలేదు. అయితే, తమిళ టాలెంటెడ్ యాక్టర్ ధనుష్​తో శేఖర్ కమ్ముల ఓ భారీ పాన్​ ఇండియా మూవీ తీయనున్నట్లు అందరికీ తెలిసిందే. ఈ సినమా అనౌన్స్​మెంట్ అయి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ షూటింగ్ మొదలుకాలేదు. అయితే, ఎట్టకేలకు మేకర్స్ ఈ సినిమా షూటింగ్​ను స్టార్ట్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు బజ్ వినిపిస్తోంది. వచ్చే ఏడాది జనవరిలో ముంబయిలో షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ ఇవ్వనున్నారనే టాక్​ నడుస్తోంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. తమిళ స్టార్ నటుడు ధనుష్​కు ఇది రెండో స్ట్రెయిట్ తెలుగు సినిమా కానుంది. గతేడాది వెంకీ అట్లూరి డైరెక్షన్​లో ‘సార్’సినిమాలో ధనుష్​ హీరోగా నటించారు. ఆ మూవీ బ్లాక్ బస్టర్​​ హిట్​ను అందుకున్న సంగతి తెలిసిందే.

Recent

- Advertisment -spot_img