మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయభేరి మోగించిన ‘మహాయుతి’ కూటమి మరోసారి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతోంది. దేవేంద్ర ఫడణవీస్ ముఖ్యమంత్రి అవుతారని తెలుస్తోంది. దీంతో మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను మహారాష్ట్ర గవర్నర్ CP రాధాకృష్ణకు అందజేశారు. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు షిండే అపద్ధర్మ సీఎంగా ఉండనున్నారు.