టోక్యోః జపాన్ ప్రధాని షింజో అబె తన పదవికి రాజీనామా చేశారు. అనారోగ్య సమస్యలతోనే రాజీనామా చేస్తున్నానని వెల్లడించారు. గత కొంత కాలంగా ఆయన పెద్దపేగు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. పలు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో పరిపాలనపై మనసును కేంద్రీకరించడం కుదరడం లేదని అందుకే రాజీనామా చేస్తున్నట్లు దేశ ప్రజలకు తెలియజేశారు. తనపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేస్తున్నందుకు తనను క్షమించాలని దేశ ప్రజలను అభ్యర్థించారు. జపాన్ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. జపాన్ చరిత్రలో షింజో అబె అత్యంత ఎక్కువ కాలం ప్రధాని పనిచేసిన ఖ్యాతి గడించారు. అంతకుముందే అబె తాను ప్రాతినిధ్యం వహిస్తున్న లిబరల్ డెమోక్రటిక్ పార్టీని అత్యవసరంగా సమావేశ పర్చి తన నిర్ణయాన్ని వెల్లడించారు. తన వారసుడు ఖరారయ్యే వరకు ప్రధానిగా బాధ్యతలు నిర్వహించేందుకు అబె అంగీకరించినట్టు పార్టీ సీనియర్ నేత టోమావి ఇనడా తెలిపారు.