Homeహైదరాబాద్school fee: సీఎం సార్​.. ప్రైవేట్​ స్కూల్స్ క్షోభకు గురిచేస్తున్నాయి

school fee: సీఎం సార్​.. ప్రైవేట్​ స్కూల్స్ క్షోభకు గురిచేస్తున్నాయి

హైదరాబాద్: ప్రైవేట్ స్కూళ్ల వ్యాపార ధోరణిపై సినీ నటుడు శివ బాలాజీ ఆయన భార్య మధుమిత మరోసారి మండిపడ్డారు.

నగరంలోని ప్రైవేట్​ స్కూల్స్ అన్ని వ్యాపార ధోరణితోనే కొనసాగుతున్నాయని, ప్రభుత్వ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్న వాటిపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. సోమాజిగూడ ప్రెస్​ క్లబ్​లో వారు మీడియాతో మాట్లాడారు.

‘‘సీఎం సార్​.. ప్రైవేట్ స్కూల్స్ అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నాయి. ట్యూషన్ ఫీజ్ మాత్రమే చెల్లించాలని ప్రభుత్వం చెప్పినా స్కూళ్లు ఇతరత్రా ఫీజులతో మానసిక క్షోభకు గురిచేస్తున్నాయి.

మేం ఇప్పటికే 35 శాతం ఫీజులు చెల్లించాం.

పూర్తి ఫీజు కట్టలేదని మా పిల్లలను పరీక్షలు రాయనివ్వటం లేదు. విద్యార్థుల తల్లిదండ్రుల బాధ అర్థం చేసుకొని ఈ సమస్యను పరిష్కరించాలి’’ అని సీఎం కేసీఆర్‌ను కోరారు.

కరోనా కాలంలో అనేక మంది ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో ఫీజులు కట్టాలని స్కూల్స్ పేరెంట్స్ పై ఒత్తిడి చేస్తున్నారని, ఫీజులు కట్టకపోతే ఆన్లైన్ క్లాసుల ఐడీలు తొలగిస్తున్నారని వారు వాపోయారు.

ఇదేమిటని ప్రశ్నించిన వారిని వ్యక్తిగతంగా టార్గెట్​ చేస్తున్నారని, స్కూళ్లన్నీ సిండికేట్ అయ్యాయన్నారు.

పేరెంట్స్ తరపున అండగా ఉండి పోరాడుతామని బాలజీ పేర్కొన్నారు.

Movie star Shiva Balaji and his wife Madhumita are once again incensed over the business trend of private schools.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img