లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్‌కు మరో షాక్ తగిలింది. బీఆర్ఎస్ నేత, మాజీ కేంద్రమంత్రి సముద్రాల వేణుగోపాలాచారి, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.