ఎస్‌బీఐ కస్టమర్లకు షాకింగ్ వార్త.. పలు రుణాలకు మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ ఆధారిత రుణ రేట్లను(ఎంసీఎల్‌ఆర్) 0.05 శాతం మేర పెంచుతున్నట్లు ఎస్‌బీఐ వెల్లడించింది. గృహరుణం లాంటి దీర్ఘకాలిక రుణాలకు సంబంధించి ఏడాది కాల ఎంసీఎల్‌ఆర్‌ను 0.05 శాతంమేర పెంచి 9 శాతానికి చేర్చినట్లు తెలిపింది. మూడు, ఆరు నెలల సమయ ఎంసీఎల్‌ఆర్‌ను కూడా పెంచినట్లు వివరించింది. శుక్రవారం నుంచి కొత్త వడ్డీ రేట్లు అమల్లోకి వస్తాయని పేర్కొంది.