బంగారం ధర మరోసారి పెరిగి మహిళలకు షాక్ ఇచ్చింది. వరుసగా రెండో రోజు కూడా బంగారం ధర భారీగా పెరిగింది. బంగారం ధరలు రోజురోజుకూ పైకి ఎగబాకుతున్నాయి. ఈ క్రమంలో పసిడి ధర తొలిసారిగా రూ.84 వేల మార్క్ దాటింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,310 పెరగటంతో రూ.84,330కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,200 పెరిగి రూ.77,300గా ఉంది. కిలో వెండి ధర వెయ్యి రూపాయలు పెరగటంతో రూ.1,07,000 గా ఉంది.
ALSO READ: