Homeహైదరాబాద్latest Newsరైతు భరోసా లబ్దిదారులకు షాక్.. ఆ వెబ్‌సైట్‌లో లక్షల ఎకరాలు బ్లాక్.. రైతులలో ఆందోళన..!

రైతు భరోసా లబ్దిదారులకు షాక్.. ఆ వెబ్‌సైట్‌లో లక్షల ఎకరాలు బ్లాక్.. రైతులలో ఆందోళన..!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 8500 సర్వే నంబర్లను బ్లాక్ లిస్టులో పెట్టి దాదాపు 2 లక్షల మంది రైతులకు రైతు భరోసాను ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం అని గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేల సర్వే నంబర్లు బ్లాక్ తో పాటు లక్షల ఎకరాలకు రైతు భరోసా గల్లంతు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు పెట్టుబడి సాయం బంద్ చేయడం ఏమిటని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ 8500 వందల సర్వే నంబర్లలో గల రైతులకు ఉండవలసిన భూమికన్న ఎక్కువ భూమి సర్వేలో గుర్తించినట్టు సమాచారం. దీంతో ఈ భూములను తాత్కాలికంగా బ్లాక్ లిస్టులో పెట్టి ఈ సర్వే నంబర్ల గల భూమిని రైతు భరోసాను బంద్ చేయటం ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వానికి దమ్ముంటే ఆర్ఎస్ఆర్ సర్వే చేపియాలని డిమాండ్ చేశారు. తమ గ్రామంలో సదరు రైతుకు రైతు భరోసా వచ్చి తనకెందుకు రైతు భరోసా రాలేదని రైతులు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారని ఆందోళన గురువుతున్నారని తెలిపారు. పాత వాళ్లకు సగమే రైతు భరోసా ఇస్తూ కొత్త వాళ్లకు మొత్తం రైతు భరోసా ఇవ్వడం లేదని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులకు పూర్తిస్థాయిలో రైతు భరోసా అందించాలని డిమాండ్ చేశారు.

Recent

- Advertisment -spot_img