ఒడిశాలోని కేంద్రపారా జిల్లాకు చెందిన 55 ఏళ్ల వ్యక్తికి 20 ఏళ్ల జైలుశిక్ష పడింది. టీనేజ్ బాయ్‌ని రేప్ చేసిన కేసులో అతనికి ఈ శిక్షను ఖరారు చేస్తూ.. ప్రత్యేక పోక్సో కోర్టు 50వేల జరిమానా కూడా విధించింది. ఒకవేళ నిందితుడు ఆ డబ్బు చెల్లించకుంటే మరో రెండేళ్ల జైలుశిక్ష అమలు చేస్తారు. గోవుల షెడ్‌లో తన కుమారుడిని రేప్ చేసినట్లు తల్లి పోలీసు ఫిర్యాదులో పేర్కొన్నది. 2021లో బాలుడిని నిందితుడు రేప్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.