కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో శనివారం ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓనం పండుగ సందర్భంగా కంజికోడులో ఇడ్లీ కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఇడ్లీ గొంతులో ఇరుక్కోవడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు ఎన్ఫోర్స్మెంట్ అధికారి సురేష్ (50)గా గుర్తించారు. ఈ పోటీలో ఒక్కసారిగా సురేష్ ఇడ్లీలు ఎక్కువగా తినడంతో గొంతులో ఇరుక్కుపోవడంతో..స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.