ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండల కేంద్రంలో తాజ్ లాల్ వైన్స్ పర్మిట్ రూంలో ఒక వ్యక్తి చికెన్ ఫ్రై తీసుకోగా తినే సమయంలో చికెన్ ముక్కలో ఈగ కనబడడంతో ఆ వ్యక్తి అవాక్కయ్యాడు. ఇదేమిటీ అని వెయిటర్ ను ప్రశ్నిస్తే తీసి పారేసేయ్ అని దురుసుగా మాట్లాడాడు. సంబంధిత యజమాని అడగక మరో చికెన్ ముక్క ఇస్తాలే అని సమాధానం చెప్పారు. ఇలా అపరిశుభ్రంగా అమ్ముతున్న అమ్మకందారులపై అధికారులు చర్యలు తీసుకొని, నాణ్యమైన ఆహారం అందించాలని, వీటిపై వెంటనే సంబంధిత మండల స్థాయి అలాగే ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు చర్యలు తీసుకొని ఆహరం మరియు ఇతర పిండి పదార్థాలపై తనిఖీలు చేపట్టాలని నాణ్యమైన ఆహార పదార్థాలు అందించేలా అధికారులు చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు. నిబంధనలను పాటించకుండా విక్రయిస్తున్న వ్యాపారస్తులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.