తాజాగా ఉత్తరాఖండ్‌లోని పౌరీ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన జరిగింది. సత్పులి ప్రాంతంలో ఓ మహిళ బాత్‌రూమ్‌లో స్నానం చేస్తుండగా ఓ వ్యక్తి రహస్యంగా వీడియో తీసి.. బ్లాక్ మెయిల్ చేసి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో విసుగు చెందిన మహిళ నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీడియోను వైరల్ చేస్తానని నిందితుడు బెదిరించేవాడని పోలీసులకు తెలిపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు నిందితుడిని అదుపులోకి తీసుకుంటామని సబ్ ఇన్‌స్పెక్టర్ దీపక్ తివారీ తెలిపారు.