కేరళ అలప్పుజా జిల్లాలో విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సూర్య సురేంద్రన్ అనే యువతి ఉద్యోగం నిమిత్తం యూకే(UK) కు వెళ్లాల్సి ఉంది. ఇంటి వద్ద అరలి పువ్వు, ఆకులు సరదాగా నోట్లో పెట్టుకుని, వెంటనే ఊసేసింది. ఇక కొచ్చి ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే ఆమె కళ్లు తిరిగి పడిపోయింది. ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ సోమవారం చనిపోయింది. ఆమెకు వైద్యులు పోస్టుమార్టం చేశారు. మృతికి గల కారణంపై స్పష్టత కోసం శాంపిళ్లను ల్యాబ్‌కు పంపించారు.