Homeహైదరాబాద్latest NewsSHOCKING: అద్దెకు వేరే వ్యక్తి భార్య.. రూ.10 మాత్రమే.. ఎక్కడో తెలుసా?

SHOCKING: అద్దెకు వేరే వ్యక్తి భార్య.. రూ.10 మాత్రమే.. ఎక్కడో తెలుసా?

“ఇదేందయ్యా ఇది.. ఇది ఎక్కడ చూడాలే”.. మాములుగా మనం టెంట్ సామాన్లు, వాహనాలు, ఇల్లు అద్దెకు ఇవ్వడం చూస్తాం కానీ భార్యను అద్దెకు ఇవ్వడం చూడలేదు..అసలు ఎప్పుడైనా ఈ మాట విన్నారా?..ఈ భాగోతం ఎక్కడో కాదు మన దేశంలోనే జరుగుతుంది. మధ్యప్రదేశ్ లోని శివపురిలో భార్యలను పరాయి మగాళ్ళకి అద్దెకు ఇస్తారు. ఇక్కడ 10 రూపాయల నుంచి వంద రూపాయలకి కూడా భార్యలను అద్దెకు ఇస్తారు. ఒక నెల లేదా ఒక ఏడాదికి ధనవంతులకి వధువు దొరక్కపోతే ఇలా అద్దెకు వేరొకరి భార్యలను తీసుకుంటారు. దీని కోసం ఒక సంత నిర్వహించి సంతలో పశువులను అమ్మినట్టు అమ్మాయిల్ని, ఆడవారిని అద్దెకు ఇస్తారు. పరాయి వ్యక్తి నుంచి డబ్బులు తీసుకున్న భర్త.. తన భార్యను కాంట్రాక్ట్ మీద ఆ వ్యక్తితో పంపిస్తాడు. ఈ క్రమంలో భార్య, పరాయి వ్యక్తి ఇద్దరు 10 రూపాయల నుంచి 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద ఈ ఒప్పందం కుదుర్చుకుంటారు. ఆ స్టాంప్ పేపర్ ని అద్దెకు ఇచ్చిన ఆవిడకు ఇవ్వడం వల్ల ఆమెను తిరిగి మళ్ళీ యజమాని అంటే భర్త కొనుక్కునే అవకాశం ఉంటుంది.

కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోయాక ఆ ఇల్లాలి మీద ఓనర్ షిప్ అనేది మళ్ళీ ఎవరైతే ఎక్కువ డబ్బు చెల్లిస్తారో వారికి వెళ్ళిపోతుంది. లేదా అంతకు ముందు అద్దెకు తీసుకున్న వ్యక్తే ఎక్కువ డబ్బు చెల్లించి కాంట్రాక్ట్ ని రెన్యువల్ చేయించుకోవచ్చు. ఒప్పందంలో భాగంగా ఒక మహిళను అద్దెకు తీసుకున్నాక కాంట్రాక్ట్ పీరియడ్ తర్వాత కూడా ఆమెతోనే కొనసాగాలంటే అదనంగా కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. పొలం కౌలుకు తీసుకున్న వ్యక్తులు కూడా కౌలు పన్ను కట్టలేక భార్యలను అద్దెకిచ్చే వారున్నారు. పెళ్లైన అమ్మాయిలనే కాదు.. పెళ్లి కాని అమ్మాయిలను కూడా తల్లిదండ్రులు వేరొకరికి అద్దెకు ఇస్తారు. మైనర్ అమ్మాయిలకు, పెళ్లి కాని అమ్మాయిలకు అక్కడ డిమాండ్ ఎక్కువ. పెళ్లైన వారి కంటే కూడా 8 నుంచి 15 ఏళ్ల వయసున్న అమ్మాయిలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. 15 వేల నుంచి 25 వేల మధ్య ఒప్పందం అనేది కుదుర్చుకుంటారు.

Recent

- Advertisment -spot_img