ఓ అరటిపండు ఏకంగా రూ.52 కోట్ల ధరను పలికింది. అంతేకాదు దానిని కొనుగోలు చేసేందుకు అనేక మంది పోటీ పడ్డారు. అయితే ఇది ఏంటి అంత స్పెషలో తెలుసుకుందాం.. ఆర్ట్ లేదా పెయింటింగ్‌ను కొన్నిచోట్ల చూసి గుర్తించి మెచ్చుకుంటారు. మరికొన్ని చోట్ల మాత్రం వేలం వేసి అమ్ముతుంటారు. అలాంటి క్రమంలో అరుదైన చిత్రాలు కోట్లు రూపాయలు పలికిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇటివల ఓ సాధారణ అరటి పండు చిత్రం రికార్డు స్థాయి ధరను దక్కించుకుంది. ‘బనానా టేప్’ అనే పెయింటింగ్ వేలంలో ఏకంగా రూ.52 కోట్లు పలికింది. ఇటాలియన్ ఆర్టిస్ట్ మౌరిజియో కాటెలాన్ సృష్టించిన బనానా టేప్ ను సోథ్‌బే సంస్థ వేలంలో ఉంచింది. న్యూయార్క్ నిర్వహించిన వేలంలో క్రిప్టోకరెన్సీ వ్యవస్థాపకుడు జస్టిస్ సన్ దానిని దక్కించుకున్నారు.