నాగార్జున సాగర్ సుంకిశాల పంప్ హౌజ్ వద్ద భారీ ప్రమాదం జరిగింది. సొరంగంలోని నీరు రాకుండా నిర్మించిన రిటెయినింగ్ వాల్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలిసింది. హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చడం కోసం సాగర్ డెడ్ స్టోరేజీ నుంచి కృష్ణజలాలను తరలించేందుకు నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం సమీపంలో సుంకిశాల పంప్ హౌజ్ నిర్మాణం చేపట్టారు. సాగర్ కు భారీ వరద వచ్చి చేరడంతో రక్షణ గోడ ఒత్తిడికి గురై కుప్పకూలింది.