గత శనివారం ముంబై నుంచి విజయవాడకు వస్తూ పుణె వద్ద ఓ హెలికాప్టర్ కుప్పకూలిన విషయం గుర్తుందా? అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదు. అయితే దిగ్భ్రాంతి కలిగించే విషయం ఏంటంటే.. ఈ హెలికాప్టర్ను ఏవియేషన్ అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం తెప్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం నెట్టింట వైరలవుతోంది. హెలికాప్టర్ విషయంలో ఉన్నతాధికారుల ఉదాసీనతపై తీవ్ర విమర్శలొస్తున్నాయి.