ఐరోపాలో అతిపెద్ద అణువిద్యుత్తు కేంద్రాల్లో ఒకటైన జపోరిజియాలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ప్రస్తుతం ఈ ప్లాంట్ నియంత్రణ రష్యా అధీనంలో ఉంది. ఈ ప్లాంట్‌లో మాస్కో దళాలే పేలుళ్లకు పాల్పడ్డాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. వారు కీవ్‌ను బ్లాక్ మెయిల్ చేసేందుకు ఈ చర్యకు పాల్పడ్డారన్నారు. రష్యా మాత్రం ఉక్రెయిన్ దళాలు ప్రయోగించిన ఫిరంగి గుండ్ల కారణంగానే మంటలు వ్యాపించాయని చెబుతోంది.