హిమాచల్‌ప్రదేశ్‌లోని సోలన్ జిల్లాలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఓ పార్మా కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు మీసాలు, గడ్డం పెంచారని 80 మంది కార్మికులను ఉద్యోగం నుంచి తీసేసింది. దీంతో ఆ కార్మికులు సమ్మె బాట పట్టారు. ఈ క్రమంలో కంపెనీ యాజమాన్యం కార్మికులతో చర్చలు జరిపింది. గడ్డం, మీసం తీసేస్తేనే విధుల్లోకి తీసుకుంటామని షరతు పెట్టడంతో షరతుకు అంగీకరించి గడ్డం, మీసాలు తీసేశారు.