ప్రియుడి మోజులో పడి తండ్రిని కూతురే కడతేర్చింది. ఈ ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జరిగింది. ఈరపు దొరస్వామి స్కూల్ టీచర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు 25 ఏళ్ల కూతురు హరిత ఉంది. అయితే కూతురికి నెల కిందట పెళ్లి సంబంధం కుదుర్చారు. పెళ్లి వద్దని చెప్పినా దొరస్వామి ఒప్పుకోలేదు. దాంతో నిద్రిస్తున్న సమయంలో ఇనుప రాడ్డుతో కొట్టి చంపింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితురాల్ని అదుపులోకి తీసుకున్నారు.