యూపీ బులంద్‌షహర్ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఖుర్జా ప్రాంతంలోని కాలువ వద్దకు శుక్రవారం వెళ్లిన స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. కాలువలో ఒక పురుషుడు, ఒక మహిళ మృతదేహాలు కొట్టుకొచ్చాయి. అయితే మృతుల వివరాలు ఇంకా లభ్యం కాలేదు. వారిని హత్య చేసి కాలువలో పడేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు అక్కడికి చేరుకుని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.