యుపిలోని ఆగ్రాలో ఓ మహిళ పెళ్లయిన 40 రోజులకే తన భర్త నుంచి విడాకులు కోరింది. దీనికి గల కారణం తన భర్త రోజూ స్నానం చేయడం లేదని. ఈ మేరకు తన భర్త నెలకు ఒకటి, రెండుసార్లు మాత్రమే స్నానం చేస్తున్నాడని, దీంతో అతడి శరీరం నుంచి దుర్వాసన వస్తుందని ఆమె తెలిపింది. దీనిపై ఆమె భర్తను ప్రశ్నించగా వారాని కోసారి తన శరీరంపై గంగా నది నీళ్లు చల్లుకుంటానని చెప్పాడు. ఈ విషయంపై ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ లో జరిగిన చర్చల అనంతరం ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది.