ఢిల్లీలోని తాజాగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఉద్యోగం ఇప్పిస్తానని తీస్ హజారీ కోర్టు న్యాయవాది 21 ఏళ్ళ యువతిపై కోర్టు ఛాంబర్‌లోనే అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను రూ.1,500 ఇచ్చి వెళ్లిపోవాలని న్యాయవాది కోరాడు. జరిగిన దాని గురించి ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని యువతిని బెదిరించాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.