హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మొగల్‌పూరలోని సుల్తాన్ షాహీ ప్రాంతంలో నిన్న ఒక మహిళ ఇంటి బయట బట్టలు ఆరబెడుతుండగా, గుర్తు తెలియని యువకుడు బైక్‌పై వచ్చి వెనుక నుండి ఆమె నోరు మూయడానికి ప్రయత్నించాడు. అప్రమత్తమైన మహిళ వెంటనే కేకలు వేయడం చుట్టుపక్కల వాళ్లంతా వచ్చారు. దీంతో ఆ యువకుడు అక్కడి నుండి పారిపోయాడు. ఇలా తెలియని వ్యక్తులు మా ప్రాంతంలోకి వచ్చి మహిళలను టార్గెట్ చేస్తున్నారని స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ద్వారా విచారణ జరిపి యువకుడి ఆచూకీ కోసం వెతుకుతున్నారు.