తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ వృద్ధురాలు దేవత అంటూ దైవంగా బావించి ఏళ్ల తరబడి ఇంట్లో పుట్టకు పూజలు చేస్తూ వస్తోంది. అయితే, ఆ పుట్ట నుంచి వచ్చిన నాగుపాము.. ఆ వృద్ధురాలిని కాటువేసింది.. ఎంతో భక్తి విశ్వాసంతో ఉన్న ఆమె అంతా నా శివయ్యే చూసుకుంటాడు అని చెప్పింది.. కానీ వృద్ధురాలు ఆ పాము కాటుకు మరణించింది. ఆ పాముకు ఎలాంటి హాని తలపెట్టకుండా అడవుల్లో వదిలేశారు.