పెళ్లయిన 18 నెలలకే ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ విడాకుల కోసం కోర్టుకెక్కింది. ఈ మహిళ విడిపోవడానికి చెప్పిన కారణం విని.. న్యాయమూర్తి సైతం షాక్ అయ్యాడు. భర్త తనను అమితంగా ప్రేమిస్తున్నాడని, తనతో అస్సలు గొడవ పడడం లేదని ఆ మహిళ విడాకులు కోరింది. అంతేకాదు తన భర్త ఎలాంటి తప్పు చేయలేదని చెప్పింది. ఇక ఆమె వాదనలు విన్న జడ్జి.. విడాకుల పిటిషన్‌ను కొట్టిపారేశారు. కాగా, ఈ అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.