బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ అభిమానులకు ఓ షాకింగ్ న్యూస్. ఇటీవల అక్షయ్ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన కోవిడ్-19 టెస్టు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. కోవిడ్ పాజిటివ్ కారణంగా అక్షయ్ ఇంటికే పరిమితమయ్యారు. నేడు జరుగుతున్న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల వివాహ వేడుకకు కూడా అక్షయ్ దూరం కానున్నారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతూ తమ విషెస్ తెలుపుతున్నారు.