ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్ని కొంటోంది చైనానే. ఇకపై తమకు గోల్డ్ అక్కర్లేదన్న డ్రాగన్ కంట్రీ ప్రకటనతో బంగారం ధరలు దిగొస్తాయని జనం ఆశపడ్డారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్(WGC) ఆ ఆశలపై నీళ్లు చల్లింది. కొత్త నిక్షేపాలు కనిపెట్టడం కష్టంగా మారడంతో బంగారం ఉత్పత్తిలో వృద్ధి కనిపించడం లేదంటూ షాకింగ్ న్యూస్ చెప్పింది. దీనివల్ల, సప్లై తగ్గి రేట్లు మరింత పెరిగే అవకాశం ఉంది.