సూరత్ లోని వీర్ నర్మద్ సౌత్ గుజరాత్ యూనివర్శిటీ మరోసారి వార్తల్లో నిలిచింది. మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఎకనామిక్స్ (ఎం.ఎ. ఎకనామిక్స్) ఎక్స్‌టర్నల్ పరీక్షకు హాజరైన 141 మంది విద్యార్థులు పరీక్ష ఫలితాలు చూసి షాకయ్యారు. మొత్తం 141 మంది విద్యార్థుల్లో ఒక్కరు మాత్రమే పాస్ అయ్యారు. దీంతో యూనివెర్సిటీపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై తగు విచారణ జరిపించాలని పలువురు విద్యార్థులు యూనివర్సిటీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు.