తుర్కియే (టర్కీ) పార్లమెంట్‌లో ఎంపీలు దారుణంగా గొడవపడ్డారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఓ నేత గురించి అధికార పక్షం వాళ్లు చులకన చేసి మాట్లాడడం వల్ల ఈ గొడవ మొదలైంది. ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా దుమారం చెలరేగింది. అధికార, విపక్ష సభ్యులు రెండు గ్రూపులుగా విడిపోయి తలపడ్డారు. ఈ ఘర్షణలో పలువురు ఎంపీలు గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.