సెల్ఫీపై మోజు ఓ మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలోని ఎడమ కాలువ వద్ద ఓ మహిళ సెల్ఫీ దిగుతుండగా కాలుజారి కాలువలో పడిపోయారు. ఆమె పడిపోవడం గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. తాళ్ల సాయంతో మహిళను కాపాడారు. మహిళ సురక్షితంగా పైకి రావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.