ఉత్తరప్రదేశ్‌లో వింత ఘటన చోటు చేసుకుంది. ఓ మామ తన కోడలితోనే ప్రేమలో పడ్డాడు. తన కొడుకు భార్య అనే ఇంగితం కూడా లేకుండా కోడలితో ప్రేమాయణం నడిపించాడు. అటు కోడలు కూడా భర్త కళ్లుగప్పి..తండ్రి స్థానంలో ఉన్న మామతో రాసలీలలు కొనసాగించింది. చివరకు.. వీళ్లిద్దరు కలిసి అతనికి శఠగోపం పెట్టి, ఇంటి నుంచి పారిపోయారు. మామ, కోడలు పరారీలో ఉండడంతో ఆ ప్రాంతమంతా చర్చనీయాంశమైంది. అయితే, కొన్ని రోజుల తర్వాత ఇద్దరూ తిరిగి స్వగ్రామానికి వచ్చి ఊళ్లో ఉన్న ఓ గుడిలో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి వార్త విని అందరూ షాక్ అయ్యారు.