Homeహైదరాబాద్latest Newsపోసాని కృష్ణ మురళి గురించి షాకింగ్ నిజం.. ఇప్పటికి 2 వేల రూపాయలతో..!

పోసాని కృష్ణ మురళి గురించి షాకింగ్ నిజం.. ఇప్పటికి 2 వేల రూపాయలతో..!

ప్రముఖ టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణ మురళి తనదైన యాక్టింగ్ తో జనాలని అలరించారు. పోసాని కృష్ణ మురళి దర్శకుడిగా కూడా మంచి సినిమాలు చేసారు. అయితే ప్రస్తుతం ఆయన గురించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. అదేంటో తెలుసుకుందాం.. రండి. ఇప్పుడు ప్రపంచం అంత డిజిటల్ యుగం నడుస్తుంది. మన జీవితం అంత స్మార్ట్ ఫోన్ మీదే ఆధారపడింది. మనం ఏమి చేయాలన్న ఫోన్ లేనిదే కష్టతరంగా మారింది. ఇలాంటి ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్ లేకుండా ఉండటం సులభం కాదు. కానీ ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి మాత్రం ఇప్పటికీ కేవలం రెండు వేల రూపాయలు ఖరీదు గలా నోకియా ఫోన్ నే వాడుతున్నారు. ఇలాంటి డిజిటల్ ప్రపంచంలో ఇంత సాదాసీదాగా జీవించడం చాలా గొప్ప విషయం అనే చెప్పాలి.అంతే కాకుండా అయన టీవీలో వార్తలు, సినిమాలు, సీరియల్స్ చూస్తుంటానని తెలిపారు. అయితే వాట్సాప్, ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లాంటి వాటి గురించి తనకు తెలియదని పోసాని కృష్ణమురళి అన్నారు. ఈ నోకియా ఫోన్ విడుదలైనప్పుడు తాను కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.

Recent

- Advertisment -spot_img