రోడ్డు, రైల్వే ట్రాక్ లు దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం. తాజాగా ఇదే కోవకు చెందిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి రైల్వే ట్రాక్ దాటాలని ఆతృతగా వస్తుండగా అతడి షూ ఉడిపోతుంది. దీంతో వెనక్కి వెళ్ళి షూ తీసుకొని మళ్ళీ వస్తాడు. ఈ క్రమంలోనే ట్రైన్ రావడం చూసి ఓ సెక్యూరిటీ రావొద్దని చెప్పినా సదరు వ్యక్తి వినిపించుకోడు. ఆ వ్యక్తి సమీపానికి ట్రైన్ రాగా క్షణాల్లో అతడిని సెక్యూరిటీ పైకి లాగి చెంపపై ఒక్కటిస్తాడు.